కోహిర్ (సెప్టెంబర్ – 06) : తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డుకు ఎంపికై, అవార్డు పొందిన సంగారెడ్డి జిల్లా కోహిర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యస్. వెంకటేశ్వరరావును మరియు కళాశాల అధ్యాపకులను విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో కోహిర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించి అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కళింగ కృష్ణ కుమార్, వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకటేశం, విష్ణువర్ధన్, శ్రీనివాస్, సుమలత, రజిత, అవినాష్, కోహిర్ ఎంపీటీసీ సాహుద్, టౌన్ ప్రెసిడెంట్ ఇఫ్తికర్, కళాశాల లెక్చరర్లు రమేష్ , సుదర్శన్, సుమలత, భాస్కర్, యాదగిరి, సంఘన్న, ధనరాజ్, నాగరాజ్, బాలకృష్ణ, మోహన్, ఆయేషా, నజియా విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Follow Us @