BIKKI NEWS (AUG. 15) : BEST LECTURER AWARD TO KOMMALA SANDHYA. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమ్మక్క సారక్క తాడ్వాయి ములుగు జిల్లాలో తెలుగు ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్న కొమ్మాల సంధ్యకు ములుగు జిల్లా ఉత్తమ లెక్చరర్ అవార్డు లభించింది.
ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన ఉత్తమ లెక్చరర్ అవార్డును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క గారు మరియు కలెక్టర్ దివాకర్ గారి చేతుల ఉత్తమ లెక్చర్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కొమ్మాల సంధ్యను కళాశాల ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య గారు, అధ్యాపక బృందం, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ అభినందించారు.