జ్యోత్స్న రాణి కి ఇండియన్ రెడ్ క్రాస్ వారి బెస్ట్ టీచర్ అవార్డ్.

  • సమాజంలో వెలుగులు నింపేది గురువులే.
  • వరుసగా అవార్డ్ లను అందుకున్న జ్యోత్స్న రాణికి జడ్జ్, వీసీల అభినందనలు.

సెప్టెంబర్ 8 న ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్, హైకోర్టు జడ్జి చంద్రయ్య గార్ల చేతుల మీదుగా రచ్చ జ్యోత్స్న రాణి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డ్ ను అందుకున్నారు.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య మాట్లాడుతూ సమాజ నిర్మాతలు గురువులే అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీ.రవీందర్, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీతారామారావు కుసుంబ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డీ. రవీందర్ యాదవ్ లు జ్యోత్స్న రాణి విద్యారంగంలో చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం శుభ సందర్భాన పలువురు ఉపాధ్యాయులను, అధ్యాపకులను సన్మానించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ మాట్లాడుతూ సమాజం లో వెలుగులు నింపేది గురువులే నని, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న ప్రతీ గురువుకి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరుసగా రెండు సార్లు ఉత్తమ టీచర్, రెండు సార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డులను అందుకున్న జ్యోత్స్న రాణి ని పలువురు విద్యావేత్తలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఇండియిన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి, ప్రొఫెసర్ బాలకిషన్, పలువురు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us @