BDS ADMISSIONS : రెండో విడత బీడీఎస్ సీట్ల భర్తీ నోటిఫికేషన్

హనుమకొండ (సెప్టెంబర్ 13) : కాళోజీ నారాయణరావు వైద్య యూనివర్సిటీ (KNRUHS)) పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో రెండో విడత బీడీఎస్ సీట్ల (BDS ADMISSIONS 2023) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అభ్యర్థులు సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 8 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ లో సీటు పొందిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని పేర్కొన్నారు.

సీట్ల వివరాలను వెబ్సైట్ లో పొందుపరిచామని, మరింత సమాచారం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ పరిశీలించాలని సూచించారు.

వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/