ముగుస్తున్న 6,7,8వ తరగతి ఖాళీ సీట్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 23) : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బిసి బాల, బాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను 6, 7 మరియు 8వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం కొరకు బీసీ‌, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ లకు చెందిన తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.

ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఎప్రిల్‌ 24వ తేదీతో ముగియనుంది. ప్రవేశ పరీక్ష మే – 10 – 2023న జరగనుంది.

◆ వెబ్సైట్ : https://mjptbcwreis.telangana.gov.in/