హైదరాబాద్ (ఏప్రిల్ 30) : తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ డిగ్రీ గురుకుల విద్యాలయాల్లో (MJPTSBC RDC CET – 2023) డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు కోసం నేడు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని 277 సెంటర్లలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరపనున్నారు.
ఈ ప్రవేశ పరీక్షల ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులలో అడ్మిషన్లు కల్పించనున్నారు.
14 డిగ్రీ గురుకులాల్లో 4,560 సీట్లుండగా 8,429 మంది దరఖాస్తు చేసుకున్నారు.