BBC : 100 మంది ప్రభావశీల మహిళలలో 4 గురు భారతీయులు

హైదరాబాద్ (డిసెంబర్ – 09) : ప్రపంచవ్యాప్తంగా 2022వ సంవత్సరంలో అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.

  • ప్రముఖ నటి-నిర్మాత ప్రియాంకా చోప్రా జోనాస్,
  • ఏరోనాటికల్ ఇంజినీర్ శిరీష బండ్ల,
  • బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ
  • సామాజిక ఉద్యమకారిణి స్నేహ జవాలేలు

వీరంతా తమ తమ రంగాల్లో స్ఫూర్తిదాయక విజయాలు సాధించినట్లు బీబీసీ తెలిపింది.