హుజుర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకట్టుకున్న బతుకమ్మ వేడుకలు

హుజుర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు రంగు రంగుల పూల తో బతుకమ్మలను పేర్చి, ఆడి పాడారు.

వేడుకలను కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ వీడిఎస్ ప్రసాద్ ప్రారంభించారు. అధ్యాపకులు అరుణ, ఉపేంద్ర, నాగరాజు, నర్సింహారావు, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మచారి, హేమచందర్ రెడ్డి, మహేష్, రామ్మూర్తి, వీరన్న, రమణ రెడ్డి, రమేష్, నాగుల మీరా, రాములు, సృజన్, అశోక్, పాల్గొన్నారు.