BIKKI NEWS (OCT. 05) : Bathukamma celebrations in gjc girls husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
Bathukamma celebrations in gjc girls husnabad.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభాదేవి గారు ప్రారంభించి కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది.
అనంతరము బతుకమ్మ సంబరాలు ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి గారు మాట్లాడుతూ… ఆడపడుచులు అందరూ బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలుపుతూ పువ్వులను దేవతలుగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని సూచిస్తూ తెలంగాణ ప్రజల యొక్క సాంప్రదాయాలను కట్టుబాట్లను సంస్కృతులను బతుకమ్మ పండుగ చాటి చెబుతుందని అన్నారు.
అనంతరం విద్యార్థులను మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పేర్చిన బతుకమ్మలలో మొదటి రెండవ మరియు మూడవ బతుకమ్మలను ఎంపిక చేసి ఆ విద్యార్థులకు బహుమతులను కళాశాల ప్రిన్సిపాల్ మరియు N.S.S చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి గారు అందజేశారు
మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు డాన్సులు మరియు సంస్కృత కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమం N.S.S ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ డి కరుణాకర్ గారి యొక్క పర్యవేక్షణలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి రవీందర్, బి లక్ష్మయ్య, ఎస్ సదానందం, టీ. నిర్మలాదేవి, ఏ సంపత్, ఎస్ కవిత, జి కవిత, రాజేంద్రప్రసాద్, జి కవిత, విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.