Home > UNCATEGORY > జిజేసీ ధర్మకంచలో బతుకమ్మ వేడుకలు

జిజేసీ ధర్మకంచలో బతుకమ్మ వేడుకలు

  • తెలంగాణ సoస్కృతికి ప్రతీక – బతుకమ్మ పండుగ – జి. జె. సి. జనగాం ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి

BIKKI NEWS (OCT. 05) : Bathukamma celebrations in gjc Dharmakancha. శనివారం నాడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, జనగామ నందు కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే పువ్వులను ఆరాధించే పండుగే బతుకమ్మ అని అన్నారు. ఈ సందర్బంగా కళాశాల అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Bathukamma celebrations in gjc Dharmakancha

తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందన్నారు .

బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రాశస్త్యాన్ని గుర్తించిన నాటి ప్రభుత్వం బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…., ఒక్కేసి పువ్వేసి చందమామ… ఒక్కజాములాయే చందమామ…, పసుపుల పుట్టింది గౌరమ్మా… పసుపుల పెరిగింది గౌరమ్మా… అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు, బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారని, చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారన్నారు.
విద్యార్థుల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, భోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని ఆట, పాటలతో అలరించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు