ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో రేపు బతుకమ్మ సంబరాలు

ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ కమిషనరేట్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ఆవరణలో ఇంటర్మీడియట్ మహిళా ఉద్యోగులు, అధ్యాపకుల చేత ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయని హైదరాబాద్ జిల్లా 711 అధ్యక్షురాలు మాలతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలో 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్. కనకచంద్రం, ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకులు నరసింహ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలతి, కళా స్వరుప, శోభ మహిళా అధ్యాపకురాళ్ళను
ప్రత్యేక ఆహ్వానం అందించారు. మహిళా ఉద్యోగులు, అధ్యాపకురాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.