కమీషనరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు – హేమచందర్ రెడ్డి

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్ కమీషనరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల సూర్యాపేట జిల్లా 711 సంఘం అధ్యక్షుడు హేమచందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ తల్లి పులకరించే విదంగా మన సంప్రదాయం ఉట్టిపడేలా మహిళల ఉయ్యాల పాటలు కోలాటాల నడుమ ఇంటర్ విద్య బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అధ్యాపకుల జె ఏ సి చైర్మన్ కనకచంద్రం మరియు ఇతర మహిళణులతో కలిసి పాల్గొనడం జరిగిందని 711 సూర్యాపేట జిల్లా అధ్యక్షడు మారం హేమచందర్ రెడ్డి తెలిపారు.

ఈ సంధర్బంగా కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకులకు, మహిళ ఉద్యోగులకు చిరు సన్మానం చేయడం జరిగిందని బతుకమ్మ సంబరాలను చాలా గొప్పగా నిర్వహించిన ఇంటర్ విద్య జె ఏ సి నాయకులకు.. పెద్దఎత్తున పాల్గొన్న మహిళా అధ్యాపక సోదరిమణులకు ఇతర నాయకులకు 711 సూర్యాపేట జిల్లా తరఫున ధన్యవాదాలను మారం హేమచందర్ రెడ్డి తెలిపారు.