రేపు హన్మకొండ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలలో పాల్గొననున్న ఇంటర్విద్యా ఉద్యోగులు

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, టి.యన్. జి.ఓ. ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు రేపు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు నిర్వహించబడునని. ఇంటర్ విద్య లో పని చేస్తున్న మహిళామణులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా శాఖ పాల్గొంటున్నది టీజీవో నాయకులు అస్నాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లతో పాటు ఇంటర్ విద్యా వరంగల్ ఆర్ జె డి శ్రీమతి జయప్రద భాయి, డి ఐ ఈ ఓ లు శ్రీ గోపాల్, మాధవరావు, వెంకన్న అతిధిలుగా విచ్చేస్తున్నారని తెలిపారు.

కావునా ఇంటర్మీడియట్ విద్యలోని అన్ని కేడర్ లలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని ఇంటర్ ఉద్యోగ సంఘాల మహిళా ప్రతినిధులు భగవద్గీత, కవిత, వాసవి, సువర్ణ, రమాదేవి, సంధ్య, శోభ, స్వాతి లు పిలుపునిచ్చారు.