తెలంగాణ కొండ గుర్తు బతుకమ్మ – బడే జ్యోతి

ప్రకృతిని, పూలను కొలిచే పండుగ బతుకమ్మ తెలంగాణ కొండ గుర్తు అని ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే జ్యోతి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయిలో జరిగిన బతుకమ్మ సంబురాలలో జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జ్యోతి మాట్లాడుతూ కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చెరువులతో వ్యవసాయంతో సుసంపన్న మైన ప్రాంతం తెలంగాణ అని అన్నారు. కేసీఆర్ బతుకమ్మ కు ప్రపంచ ఖ్యాతిని తెచ్చారు అని అన్నారు.
విద్యార్థులతో కలిసి ఆడి పాడారు.

కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువులకు కృతజ్ఞతను తెలిపే బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాక అని అన్నారు. బతుకమ్మ పాటలు సుస్థిర సమ్మిళిత సంస్కృతిని తెలియచేస్తాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకళ అధ్యాపకులు సంధ్య, కిషన్, మూర్తి, అశోక్, రాజ్ కుమార్, శ్రీలత, రాజు, శ్వేత, వందలాది విద్యార్థులు పాల్గొన్నారు.