ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ నందు ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఎన్.ఎస్.ఎస్. చైర్మన్ నల్లా రాంచంద్రా రెడ్డి మాట్లాడుతూ పూలనే దేవతలు గా పూజించే పండుగ బతుకమ్మ అని, మహిళలు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి కి నిదర్శనం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్స్, మహిళ అధ్యాపకులు, విద్యార్థినిలు బతుకమ్మ ఆటపాటలతో వేడుకలు ఎన్.ఎస్.ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ కరుణాకర్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో సత్తమ్మ, వరూధిని, కవిత, స్వరూప‌ కవిత, రవీందర్, సదానందం‌, లక్ష్మయ్య, రాజేంద్రప్రసాద్, పద్మ, భాగ్యలక్ష్మీ, సలీం, విద్యార్థులు పాల్గొన్నారు.