ప్రభుత్వ జూనియర్ కళాశాల – చందుర్తి లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల చందుర్తి యందు తెలంగాణ సాంస్కృతిక చిహ్నం అయిన బతుకమ్మ ఉత్సవాలను మహిళ సిబ్బంది మరియు విద్యార్థినిల ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి. మల్లేష్ మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప సంప్రదాయం బతుకమ్మ అని, మహిళలు వారి యొక్క పాటలు పాడే, నృత్యాలు చేసే వివిధ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే గొప్ప అవకాశం బతుకమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు, మహిళా స్టాఫ్ కు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మోహన్, రమేష్ బాబు, జగన్, కృష్ణాకర్,ళదండు రమేష్, సుమన్, సుమలత, సుజాత తదితరులు పాల్గొన్నారు.