సంస్కృతి, సాహిత్యం, నృత్యాల మేళవింపు మన బతుకమ్మ

  • విద్యార్థులతో ఉల్లాసంగా బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, లింగయ్యలు.
  • ఆట పాటలతో ఘనంగా దర్మకంచ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు..

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాలను గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ ధర్మ కంచ జనగామ నందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ మునిసిపల్ ఛైర్పర్సన్ పొకల జమున, లింగయ్యలు ముఖ్య అతిధిలుగా, జిల్లా ఇంటర్ విద్యా అధికారి బైరి శ్రీనివాస్ దంపతులు విశిష్ట అతిథులుగా పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

విద్యార్థులు ప్రకృతి నుండి వివిధ రకాల పూలను సేకరించి సంప్రదాయ రీతిలో పేర్చిన బతుకమ్మలతో పోకల జమున, లింగయ్య లు, ఇంఛార్జి ప్రిన్సిపాల్ నందినీ పటేల్, జిల్లా ఇంటర్ విద్యా అధికారి సతీమణి బైరి సృజన విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో బతుకమ్మ పాటలకు ఉల్లాసంగా చప్పట్లు, తాళాలు ఆట పాటలతో నృత్యాలు చేసి అలరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి కళాశాల అధ్యాపకులతో బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాట నృత్యాలు చేస్తూ కళాశాలలో ఉత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పోకల జమున మాట్లాడుతూ పూలనే భగవంతుడి గా భావించి కొలిచే ప్రత్యేక వేడుక మన బతుకమ్మ పండగ అన్నారు. ఈ సందర్భంగా పోకల జమున జనగామ పట్టణ ప్రజలకు దేవి నవరాత్రి శుభాకాకాంక్షలు తెలిపారు.

జిల్లా ఇంటర్ విద్యా అధికారి బైరి శ్రీనివాస్ సతీమణి బైరి సృజన మాట్లాడుతూ ఆడ బిడ్డలు పుట్టినిల్లు చేరి అనురాగం ఆప్యాయతలతో పది రోజుల పాటు ఘనంగా నిర్వహించుకునే వేడుక మన బతుకమ్మ పండగ అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణా ఆడ పడుచులందరికి బైరి సృజన బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇంఛార్జి ప్రిన్సిపాల్ నందినీ పటేల్ మాట్లాడుతూ సంస్కృతి, సాహిత్యం, నృత్యాల మేళవింపు మన బతుకమ్మ పండగ అన్నారు.

ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్,జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య మాట్లాడుతూ తెలంగాణాలో దేవినవరాత్రులంటే ఏంతో ప్రాధాన్యం వుందన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది మంది లక్ష్మీదేవి అమ్మ వార్లను కొలవడం ద్వారా సమాజంలో సిరి సంపదలు,సుఖసంతోషాలు నెలకొంటాయి అన్నారు. విద్యార్థులు ఇష్టం తో చదివి మన కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలన్నారు. దాతలు గజ్జి మధు గారి సహకారంతో వెయ్యి మంది విద్యార్థులకి సంక్రాంతికి ఉచితంగా దుస్తులు అందిస్తామన్నారు. చదువుల్లో ప్రతిభ కనబరిచిన విధ్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించటం తో పాటు కళాశాల వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని విధ్యార్థులకు హామీ ఇచ్చారు.

జిల్లా ఇంటర్ విద్యా అధికారి బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు బతుకమ్మ పండగను ఆనందోత్సహాలతో జరుపుకోవడం తో పాటు రాబోయే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు.

ఈ బతుకమ్మ సంబరాల్లో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, మారిపెళ్ళ రవి ప్రసాద్, కళాశాల అధ్యాపకులు గుమ్మడి శృతి, మాధంశెట్టి వరూధిని, బట్టు రేఖ, కొండ్ర వనమాల, కూతాటి బాలరాజు, అమరేందర్ రెడ్డి, ఎండీ అఫ్జల్, వంగ పల్లి విష్ణు లతో పాటు పలువురు అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.