ఇంటర్ బోధించు మోడల్ స్కూల్ పిజిటిలకు ఈ పిఆర్సీలో జేఎల్ స్కేల్ కల్పించాలి -తరాల జగదీష్

  • PRTU మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( PMTA TS) తరపున విజ్ఞప్తి
  • సమాన పనికి సమాన వేతనం కింద వేతన సవరణ చేయాలని పలుమార్లు బిస్వాల్ కమిటీకి నివేధించిన రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్ లలో మొత్తం 2522 మంది పిజిటి లకు గాను 1994 మంది పిజిటి లు 9వ తరగతి నుండి ఇంటర్ వరకు బోధించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వివిధ రకాల విద్యా వ్యవస్థ (ప్రభుత్వ కళాశాలలు, గురుకులాలు) లలో ఇంటర్ బోధించు వారికి జె.యల్. స్కేల్ ( బేసిక్ 37,100/- ) వర్తింప చేయడం జరుగుతుంది. కాని మోడల్ స్కూల్ లలో పనిచేసే పిజిటి లు ఇంటర్ వరకు బోధించుచున్నా కూడా వారి బేసిక్ వేతనం 31,460/- గా ఉండడం అన్యాయము అని మరియు సమాన పనికి సమాన వేతనం నియమావళికి విరుద్ధంగా ఉంది అని పలుమార్లు పి ఆర్ సి కమిటీ అయిన బిస్వాల్ కమిటీకి నివేధించడం జరిగింది.

ఇంటర్ వరకు బోధించుచు కూడా సుమారు ప్రతి నెల 10000/- రూపాయల పైన నష్టపోవడమే కాకుండా శ్రమకు తగిన వేతనం అందకపోవడం వలన మోడల్ స్కూల్ అధ్యాపకులు ఆవేదనకు గురికావడం జరుగుతుంది అని PRTU మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (PMTA TS) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ వ్యత్యాసం వలన ఊహకందని నష్టము జరుగుతుంది. ఈ నూతన పి ఆర్ సి నందు మోడల్ స్కూల్ పిజిటి లకు జేయల్ స్కేల్ కల్పించే విధంగా గా వేతన సవరణ చేసి న్యాయము చేయాలని పలు మార్లు బిస్వాల్ కమిటీకి సంఘం తరుపున నివేధించడం జరిగింది.

కావున ఈ నూతన పి ఆర్ సి లో మోడల్ స్కూల్ పిజిటి లకు వేతన వ్యత్యాసం సవరించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోధించు అధ్యాపకులతో సమాన వేతనం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us @