డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లకు తీపి కబురు

ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 5 వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లకు నూతన పీఆర్సీ ప్రకారం కొత్త మినిమం బేసిక్ పే ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన పైల్ ఆర్థికశాఖ అమోదం లభించిందని సమాచారం. తెలంగాణ తొలి పీఆర్సీ జీవోలతో పాటు కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించిన బేసిక్ పే జీవోలు కూడా విడుదల కానున్నాయని అధికార వర్గాల సమాచారం.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు, కాంట్రాక్టు అధ్యాపకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Follow Us @