కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే అమలు విషయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తా – 475 బృందంతో పల్లా

ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ సారి ఘన విజయం సాధించిన రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఈరోజు 475 సంఘం నాయకులు టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డితో కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.

బేసిక్ పే కోసం వినతి పత్రం ఇస్తున్న 475 బృందం

ఈ సందర్భంగా తెలంగాణ తొలి పిఆర్సి అమలు విషయంలో కాంట్రాక్ట్ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఆందోళనలో ఉన్నారని ప్రస్తుతం ఇస్తున్న బేసిక్ పే ప్రకారం ఈ నూతన పిఆర్సి లో కూడా బేసిక్ పే అమలు చేయాలని, బేసిక్ పే తో పాటు డీఏ & హెచ్.ఆర్.ఏ. కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా వస్కుల శ్రీనివాస్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వివరించారు.

అసెంబ్లీలో కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల విషయంలో సీఎం చేసిన ప్రకటనతో గందరగోళంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారని కావున గతంలో ఉన్నట్లుగానే కేసీఆర్ అమలు చేసిన బేసిక్ పే ను కాంట్రాక్ట్ అధ్యాపకులకు వర్తింప చేయాలని ఈ సందర్భంగా 475 జిల్లా నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

దీనిపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంట్రాక్ట్ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులు ఎలాంటి ఆందోళన చెందవద్దని గతంలో ఏ విధంగా అయితే బేసిక్ పేను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వమే కల్పించిందని కావునా ప్రస్తుత పిఆర్సి లో కూడా బేసిక్ పే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టమైన హామీ ఇచ్చారని వస్కుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్రెడ్డి, వస్కుల శ్రీనివాస్, శోభన్ బాబు, సంగీత, విశాలాక్షి, గణపతి, మనోహర్, బాస్కర్, గణేష్, విజయ్ మోహన్, రాజిరెడ్డి, కిరణ్, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పేను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వమే కల్పించిందని కావునా ప్రస్తుత పిఆర్సి లో కూడా బేసిక్ పే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

– పల్లా రాజేశ్వర్ రెడ్డి

Follow Us@