కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ పే వేతన జీవోలు విడుదల, జీవో కాపీలు

తెలంగాణలోని ఉన్నత విద్యా లోని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు నూతన పి ఆర్ సి 2020 ప్రకారం బేసిక్ పే వేతనం కల్పిస్తూ జీవో నెంబర్ 104, 105, 106 విడుదల కావడం జరిగింది.

GO No. 104 ( CDLs)

GO No. 105 (CJLs)

GO No. 106 ( PTCLs)

జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు 54220, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లకు 58850 వేతనం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ నూతన వేతనం జూన్ – 2021 నుండి అమలు కానున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాల నేతలు సిహెచ్ కనక చంద్రం, వినోద్ కుమార్, కొప్పిశెట్టి సురేష్, రమణా రెడ్డి, గాదే వెంకన్న, కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us @