కాంట్రాక్ట్ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్ లకు బేసిక్ పే కల్పిస్తూ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరరులు, పాలిటెక్నిక్ లెక్చరర్లకు బేసిక్ పే వేతనం కల్పిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంచాలని నూతన పీఆర్సీ పేర్కొనగా, గతం నుండి కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ పే ఇస్తున్న ప్రకారమే 2020 పీఆర్సీ రిపోర్ట్ కూడా వీరికి బేసిక్ పే ఇవ్వాలని కమిటీ సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీరికి బేసిక్ పే ఉత్తర్వులు రావడం జరిగింది. ఈ ఉత్తర్వులు జూన్ నుండి అమలు కానున్నాయి.

Follow Us @