BASARA IIIT : ఖాళీ బీటెక్ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ

బాసర (మే – 21) బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థులలో కొంతమంది ఇంటర్ చదివి, బీటెక్ మాత్రం ఇతర కళాశాలల్లో చేరుతున్న నేపథ్యంలో ఆ సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయాలని వర్సిటీ నిర్ణయించింది.

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ (రెండేళ్లు ఇంటర్, నాలుగేళ్లు బీటెక్)లో చేరుతున్నారు. ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు బీటెక్ లో వివిధ బ్రాంచీలు కేటాయిస్తారు. దీంతో ఇక్కడ చదివితే కంప్యూటర్ సైన్స్ లో సీటు దక్కదని భావిస్తున్న విద్యార్థులు ఏటా దాదాపు 300 మంది వరకు ఎంసెట్ రాసి రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ లో చేరుతున్నారు. ఈ కారణంగా ఏటా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. వాటిని ఈసారి లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.