నిర్మల్ (జూలై – 09) : బాసర ఆర్జీయూకేటీలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన కౌన్సెలింగ్ జులై 9 తో ముగిసింది. మూడు రోజుల్లో 1,404 మంది విద్యార్థులను కౌన్సెలింగ్ కు ఆహ్వానించగా, 1,251 మంది ప్రవేశాలు పొందారు.
మిగతా 153 మంది హాజరు కాలేదు. నియమాలను అనుసరించి మిగిలిన సీట్లను త్వరలో భర్తీ చేస్తామని డైరెక్టర్
సతీష్ కుమార్ తెలిపారు.