BASARA IIIT : వారంలో ప్రవేశాల నోటిఫికేషన్

హైదరాబాద్ (మే – 17) : ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (RGUKT – BASARA ADMISSIONS 2023)లో ప్రవేశ నోటిఫికేషన్ వారంలో విడుదలకానున్నది. నోటిఫికేషన్ జారీకి అనుమతి కోరుతూ ఆర్జీయూకేటీ అధికారులు ఇటీవలే ఫైలు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ను జారీచేస్తారు.

ఈ ఏడాది పదవ తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఇందుకు తొలుత విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, మెరిట్ ప్రకారం సీట్లను భర్తీచేస్తారు. ఆర్జీయూకేటీలో 1,400 పైగా సీట్లుండగా, ఈ ఏడాది పది ఫలితాల్లో మొత్తం 6,163 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.