BARC JOBS : 4,374 ఉద్యోగాలకై నోటిఫికేషన్

ముంబై (ఎప్రిల్‌ – 22) : భారత అణు పరిశోధన విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC JOBS RECRUITMENT) లో 4, 374 టెక్నికల్ ఆఫీసర్, స్టైఫండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ -24 నుండి మే – 22 – 2023 వరకు

★ ఖాళీల వివరాలు :

◆ డైరెక్ట్ రిక్రూట్మెంట్:

  1. టెక్నికల్ ఆఫీసర్/ సి: 181 పోస్టులు
  2. సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7 పోస్టులు
  3. టెక్నీషియన్/ బి: 24 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 212

ప్రారంభ వేతనం: నెలకు టీవో ఖాళీలకు రూ.56,100; ఎస్ఏకు రూ.35,400; టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చెల్లిస్తారు.

◆ ట్రైనింగ్ స్కీం (స్టైపెండరీ ట్రైనీ):

  1. కేటగిరీ-1: 1216 పోస్టులు
  2. కేటగిరీ-2: 2946 పోస్టులు
  3. మొత్తం పోస్టుల సంఖ్య: 4,162

స్టైపెండ్: నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది.

◆ విభాగాలు: బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ మైనింగ్ తదితరాలు.

◆ అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎస్ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి (22.5.2023 నాటికి): టెక్నికల్ ఆఫీసర్ కు 18-35; సైంటిఫిక్ అసిస్టెంట్ కు 18-30; టెక్నీషియన్ కు 1825; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

◆ ఎంపిక విధానం : ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ దరఖాస్తు రుసుము: టీవోకు రూ.500; ఎస్ఏకు రూ.150; టెక్నీషియన్ కు రూ.100; కేటగిరీ-1కు రూ.150; కేటగిరీ-2కు రూ .100; ఎస్సీ/ ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఉంటుంది.

◆ తెలుగు రాష్ట్రాల లో పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్.

◆ దరఖాస్తు లింక్ : https://barconlineexam.com/

◆ వెబ్సైట్ : https://www.barc.gov.in/careers/recruitment.html