జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం

జగిత్యాల (జూన్ – 26) : జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. బండలింగాపూర్‌ గ్రామం మండల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. మెట్‌పల్లిలోని పది గ్రామాలతో బండలింగాపూర్‌ మండలంగా ప్రతిపాదించింది.

15 రోజుల్లో అభ్యంతరాలు, వినతులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉండగా.. 380 గ్రామాలున్నాయి.

మరో వైపు సంగారెడ్డి నుంచి కామారెడ్డి జిల్లాకు బాబుల్‌గాం గ్రామాన్ని బదలాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.