CNG TWO WHEELERS : RAHUL BAJAJ

BIKKI NEWS (నవంబర్ – 23) : BAJAJ CNG TWO WHEELER VEHICLE ను 2025వ సంవత్సరం వరకు మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తామని రాహుల్ బజాజ్ తెలిపారు.

పెట్రోల్‌ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్విచక్ర వాహన దారులకు ఇది మంచి శుభవార్త, అలాగే పర్యావరణ పరంగా కూడా ఇది మంచి పరిణామం. ప్రస్తుతం సీఎన్‌జీ కార్లకు, ఆటోలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే.

ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ బజాజ్‌ ఆటో ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించింది. ప్రస్తుతం సీఎన్‌జీ ద్విచక్ర వాహనాలు ప్రారంభ దశలో ఉన్నాయని, 2025 నాటికి ఈ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్టు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సీఎన్‌జీ ద్విచక్ర వాహనాలు లేవని తెలిపారు.

అయితే ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ స్కూటర్ ల వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే ఏడాది వరకు ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లు మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. మరి సీఎన్‌జీ టూ వీలర్స్ వీటితో మార్కెట్ లో పోటీ పడాల్సి ఉంటుంది.