సీజేఎల్స్ బదిలీలు కోరుతూ ప్రిన్సిపాళ్ళకు వినతి పత్రాలు

కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీ సాధన సమితి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాళ్ళకు కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు చేపట్టాలని కోరుతూ ఈ రోజు వినతి పత్రాలు అందించడం జరిగింది.

ఏళ్లుగా బదిలీలు లేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టు అధ్యాపకులను గతేడాది సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు బదిలీలు వెంటనే జరపాలని ఈ సందర్భంగా బదిలీ బాధితులు తెలిపారు. ఈ వినతి పత్రాలు అందించే కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుందని కన్వీనర్ నరసింహ రెడ్డి తెలిపారు.