BIKKI NEWS (JUNE 22) : B2 and BUNKER BOMBS . ఇరాన్ ఇజ్రాయిల్ సంఘర్షణల నేపథ్యంలో అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది అని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లోని అణు స్థావరాలపై విజయవంతంగా దాడి చేసినట్లు ప్రకటించారు.
B2 and BUNKER BOMBS
అయితే ఇరాన్ అణు స్థావరాలు భూగర్భంలో ఉండటంతో వాటిని పేల్చే సామర్థ్యం ఇజ్రాయిలకు లేదని కూడా తాజాగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అమెరికా సైనిక అమ్ముల పొదిలో ఉన్న బీ2 బాంబులు మరియు బంకర్ బ్లాస్టర్ బాంబులను అమెరికా ఇరాన్ పై వేయునుందా అనేది తాజాగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఈ బాంబుల శక్తి సామర్థ్యాల గురించి చూద్దాం
GBU-57 బంకర్ బస్టర్ బాంబు
- ఇది అమెరికా అభివృద్ధి చేసిన అతి భారీ భూగర్భ దాడి బాంబు.
- బరువు: సుమారు 14 టన్నులు (30,000 పౌండ్లు)
- పొడవు: 6.2 మీటర్లు
- పేలుడు పదార్థం: 2.5 టన్నుల హై-ఎక్స్‌ప్లోసివ్ పదార్థం
- లక్ష్యం: భూమిలో బాగా లోతుగా నిర్మించిన బంకర్లు, అణు ప్రయోగ స్థలాలు, భద్రత గల కేంద్రాలు.
- చొచ్చుకుపోయే సామర్థ్యం: 60 మీటర్ల కాంక్రీట్, లేదా 40 మీటర్ల రాతి భూమిని ఛేదించగలదు.
- ఇది ఒక సాధారణ (నాన్-న్యూక్లియర్) పేలుడు ఆయుధం.
B-2 Spirit Bomber (స్టెల్త్ బాంబర్ విమానం)
- దేశం: అమెరికా (US Air Force)
- పేరు: B-2 Spirit Bomber
- ప్రత్యేకత: స్టెల్త్ టెక్నాలజీ ఉండటం వల్ల రాడార్‌కి కనిపించదు.
- పరిమాణం: వింగ్స్‌పాన్ 52 మీటర్లు
- రేంజ్: ఒకేసారి 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
- పేలోడ్: కన్‌వెన్షనల్ మరియు న్యూక్లియర్ బాంబులను మోసే సామర్థ్యం
GBU-57 బాంబును B-2 Spirit Bomber నుంచే వదులుతారు.
ఎందుకంటే GBU-57 బరువు చాలా ఎక్కువగా ఉంటుంది, మరియు దాన్ని మోసే శక్తి, రహస్యంగా టార్గెట్ దగ్గరికి చేరే టెక్నాలజీ B-2 బాంబర్‌కి మాత్రమే ఉంది.
స్టెల్త్ టెక్నాలజీతో కూడిన B-2 టార్గెట్ ప్రాంతానికి గుట్టుగా చేరి, GBU-57 బాంబును భూగర్భ బంకర్లపై వదిలి దాడి చేస్తుంది.
శత్రువు భూమిలో లోతుగా నిర్మించుకున్న అణు కేంద్రాలపై దాడి చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు: ఇరాన్ లేదా ఉత్తర కొరియాలో ఉండే అణు బంకర్లపై దాడులకు దీనిని వినియోగించే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు ఇలాంటి బాంబర్ లేదా బాంబులు మరే దేశం దగ్గర లేవు, ఇప్పటి వరకు బంకర్ బస్టర్ 57 బాంబును అమెరిక ఎక్కడా ప్రయోగించలేదు.
ఇరాన్ క్షిపణులు మరియు అణు స్థావరాలు ఎత్తైన కొండల కింద ఉంచి కాపాడుకుంటుంది, ఈ బాంబుల వరుసగా ప్రయోగిస్తే ఎంత లోతులో ఉన్న స్థావరాలనైన ఛేదించే సత్తా ఉంది.
ఇప్పటికీ నాలుగు B2 విమానాలు ఒక్కో విమానం లో 2 బంకర్ బస్టర్ బాంబులతో పచ్చిమాసియాకు పయనమైనట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ బాంబుల బరువు ఎక్కువ కనుక తక్కువ ఇంధనం నింపుకుని వెంట ఇంధనం నింపే ట్యాంకర్ లతో కాలిఫోర్నియా నుండి బయలు దేరాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్