AYUSH COURSES – ఆయుష్‌ కోర్సులైన ఆయుర్వేద, యునాని, హోమియో అడ్మిషన్స్

BIKKI NEWS (NOV. 15) : Ayush Courses admissions in telangana. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ యూజీ, పీజీ ఆయుష్‌ కోర్సులైన ఆయుర్వేద, యునాని, హోమియో లలో యాజమాన్య కోటాలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు..

Ayush Courses admissions in telangana

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏఐఏపీజీఈటీ – 2024, యూజీ నీట్‌-2024 ఆయుష్‌ కటాఫ్‌ స్కోర్‌ను 15 శాతానికి తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.

తగ్గిన కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ ఆయుష్‌ సీట్ల కోసం నవంబర్ 16 నుంచి 19 వరకు, యూజీ ఆయుష్‌ సీట్లకు నవంబర్ 15 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు కన్వీనర్‌, యాజమాన్య కోటాలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారని, వివరాలకు కాళోజీ నారాయణరావు వెబ్‌సైట్‌ను చూడాలని ప్రకటనలో పేర్కొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు