Home > UNCATEGORY > జీజేసీ చిట్యాలలో మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం

జీజేసీ చిట్యాలలో మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం

BIKKI NEWS (NOV. 06) : Awareness programme on drugs in GJC Chityal. చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీదేవి అధ్యక్షతన ఈరోజు ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రహరీ క్లబ్ అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి, రెండవ ఎస్సై షా ఖాన్, ముఖ్య అతిథిగా సైకియాట్రిస్ట్ డాక్టర్ రాము, ఎన్ ఎస్ ఎస్ పి ఓ యుగంధర్, మెంబర్ కానిస్టేబుల్ లింగన్న హాజరయ్యారు.

Awareness programme on drugs in GJC Chityal.

ఈ సందర్భంగా సైకియాట్రిస్ట్ డాక్టర్ రాము విద్యార్థులకు మానసిక ఒత్తిడి మరియు అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మానసిక అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలు మరియు డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే నష్టాలు వాటి నిర్మూలన తదితర అంశాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆధారమని, విద్యార్థుల అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు కాకూడదని, పొరపాటున కూడా అటువైపు వెళ్ళకూడదని, మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచనలు చేశారు.

ఎస్సై షా ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగించడం లేదా ఏ ఇతర కారణాల చేత అయిన వారు ఒకవేళ అందులో ఉన్నట్లయితే వారికి చట్టపరంగా ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలను వారు వివరించారు.

ప్రహరీ క్లబ్ ఉపాధ్యక్షుడు యుగేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి, చిట్యాల రెండవ ఎస్సై శాఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ రాము, హనుమకొండ ఎన్ఎస్ఎస్ పిఓ యుగంధర్, ప్రహరీ క్లబ్ నెంబర్ కానిస్టేబుల్ లింగన్న, లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాప్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు