BIKKI NEWS : టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లలో మొట్టమొదటి టోర్నీ 117 ఏళ్ల చరిత్ర కలిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ . 110వ ఎడిషన్ లో బాగంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన టోర్నీ 2022 విజేతలు మరియు విశేషాలు… (australian-open-2022-winners-list-in-telugu)
రఫెల్ నాదల్ 20 ఓపెన్ టైటిల్స్ తో రోజర్ పెదరర్, నొవాక్ జకోవిచ్ లతో అత్యధిక టైటిల్స్ తో సమానంగా ఉన్నాడు. ఈ టైటిల్ తో 21వ రికార్డు టైటిల్ ను సాదించి చరిత్ర సృష్టించాడు. ఇంతవరకు 2009 లో ఒకసారి మాత్రమే ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించాడు. 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, 2 సార్లు వింబుల్డన్, 4 సార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాదించాడు.
మహిళల సింగిల్స్ విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ అమెరికా కు చెందిన డానియెల్లి కొలిన్స్ ను పైనల్ లో ఓడించి తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఆష్లే బార్టీ కి ఇది మూడవ ఓపెన్ టెన్నిస్ టైటిల్. ఇంతకు ముందు 2019లో ప్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ టైటిల్ లను గెలుచుకుంది. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఆస్ట్రేలియన్ గా బార్టీ నిలిచింది. 1978 లో క్రిస్టీనా ఓనిల్ ఈ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ కావడం విశేషం.
డానిల్ మెద్వదేవ్ ఇప్పటివరకు 2021లో యూఎస్ ఓపెన్ టైటిల్ మాత్రమే సాదించాడు.
పురుషుల సింగిల్స్ ::
విన్నర్ : రాఫెల్ నాదల్ ( స్పెయిన్)
రన్నర్ : డానిల్ మెద్వదేవ్ (రష్యా)
మహిళల సింగిల్స్
విన్నర్ : ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)
రన్నర్ : డానియెల్లి కొలిన్స్ (అమెరికా)
పురుషుల డబుల్స్
విన్నర్ : నిక్ కిర్గియోస్ & థానస్ కొక్కినాకిస్ (ఆస్ట్రేలియా)
రన్నర్ : మాథ్యూ హెబ్డెన్ & మ్యాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)
మహిళల డబుల్స్
విన్నర్ : బార్బోరా క్రెజికోవా & కాటిరీనా సినియాకోవా (చెక్ రిపబ్లిక్ )
రన్నర్ : అన్నా డానిలినా. (కజకిస్థాన్) & బి. హద్దద్ మైయా ( బ్రెజిల్)
మిక్సడ్ డబుల్స్
విన్నర్ : క్రిస్టినా మ్లాడెనోవిక్ (ప్రాన్స్) & ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)
రన్నర్ : జైమీ ఫోర్లిస్ & జేసన్ కుబ్లర్ (ఆస్ట్రేలియా)