హైదరాబాద్ (ఆగస్టు – 07) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 29, 30వ తేదీలలో గ్రూప్ – 2 పరీక్ష కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించింది.
ఆగస్టు 29 మరియు 30వ తేదీలలో పలు విద్యాసంస్థల్లో గ్రూప్ -2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్ష ఉదయం మరియు సాయంత్రం సేషన్స్ లలో జరగనున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.