హైదరాబాద్ (మే – 02) : కళాశాల చదువు లేకుండా ఇంటర్మీడియట్ పరీక్ష వ్రాయడానికి అవకాశం కల్పిస్తూ హజరు మినహాయింపు ఫీజు చెల్లించడానికి ప్రైవేట్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పిస్తుంది.
ఇందుకు గాను అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి గడువును మే – 03 నుండి 10 వ తేదీ వరకు విధించారు.
అభ్యర్థులు కేవలం ఆర్ట్స్ మరియు హ్యుమానిటీస్ గ్రూపులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
పదవ తరగతి ఉత్తీర్ణత సాదించి ఒక సంవత్సరం గడిస్తే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫీజు, రెండు సంవత్సరాలు గడిస్తే ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.