భారత అణు వ్యవస్థ విశేషాలు

BIKKI NEWS : atomic-energy-and-centres-in-india

  • భారత అణు పరిశోదన పితామహుడు – జహంగీర్ హోమి బాబా
  • 1948లో అణుశక్తి సంఘం ఏర్పాటైంది
  • 1956లో ఇండియన్ అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ను ట్రాంబే (ముంబాయి) వద్ద ఏర్పాటు చేసారు. దీనిని BARC గా మార్చారు

★ భారత్ లో అణు పరిశోధనా కేంద్రాలు 2 అవి

  1. BARC (ముంబాయి) 2. IGCR (కల్పకం)

★ అప్సర:- భారత తొలి అణు రియాక్టర్ అప్సర. దీనిని 1956లో BARC లో ఏర్పాటు చేసారు. తర్వాత అప్సరను తారాపూర్ కు మార్చారు.

★ ధృవ :- భారత్ లో అతి పెద్ద అణు రియాక్టర్ ధృవ

★ కామిని :- మొదటి ఫాస్ట్ బ్రీడర్ న్యూట్రాన్ రియాక్టర్ కామిని (కల్పక్కం)

అణు విద్యుత్ కు కావల్సిన అణు ఇంధనంగా యురేనియం ను ఉపయోగిస్తారు.

భారత్ లో యురేనియం లభించే ప్రాంతాలు 1. జదుగూడ (జార్ఖండ్) 2. దేవరకొండ (నల్గొండ)

అణు ఇంధనం తయారు చేయు ప్రదేశం – న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (హైదరాబాద్)

★ అణు పరీక్షలు :- భారతదేశం ఇప్పటివరకు రెండుసార్లు అణుపరీక్షలు నిర్వహించింది. అవి…

రాజస్థాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం 1974 మే 18న రాజారామన్న సారధ్యంలో మొట్టమొదటి సారి అణు పరీక్షలు నిర్వ హించింది. ఆరోజు బుద్ధ జయంతి. అందు వల్ల ‘బుద్ధుడు నవ్వాడు‘ అనే ఆపరేషన్ కోడ్ పెట్టారు. ఈ కోడ్ పరిభాషకు అర్ధం – “పరీక్ష విజయ వంతమైంది” అని.

1998 మేలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం సారధ్యంలో 5 అణు పరీక్షలు నిర్వహించారు. దీనిని “ఆపరేషన్ శక్తి” అని పేరు పెట్టారు. 1998 మే 11న మూడు, మే 13న రెండు నిర్వహించారు. మే 11న నిర్వహించిన 3 పరీక్షలలో మొదటి రెండు ఫిజన్ డివైజ్ అంటే అణం విచ్చితి‌‌, మూడవది ప్యూజన్ డివైజ్ అంటే సంలీన ప్రక్రియ.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు