BIKKI NEWS (AUG. 24) : ASSISTANT PROFESSOR JOBS IN AP DME. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ASSISTANT PROFESSOR JOBS IN AP DME
మొత్తం పోస్టుల : 488.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 16 – 2024
అర్హతలు : సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 42 సంవత్సరాలు (EWS, SC, ST, BC 47) లోపల ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 1,000/- (SC, ST, BC, EWS, PH – 500/-)
ఎంపిక విధానం : అర్హత డిగ్రీ లో సాదించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా
స్పెషాలిటిస్ : సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, టీబీ & సీడీ, ట్రాన్ఫ్యూజన్ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, ఎస్పీఎం.