BIKKI NEWS (JAN. 24) : ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను ( assistant post in new india assurance company) విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : 01-02-2024 నుంచి 15-02-2024 వరకు
అసిస్టెంట్: 300 పోస్టులు
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం : నెలకు 37,000/-
వయోపరిమితి : 01-01-2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.