AMVI Hall Tickets : అసిస్టెంట్ మోటార్ వెహికిల్ హల్ టికెట్లు

హైదరాబాద్ (జూన్ – 20) : అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ASSISTANT MOTOR VEHICLE INSPECTOR EXAM HALL TICKETS) జూన్ – 21 నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది.

జూన్ 28న అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ పరీక్ష జరుగనున్నది. ప్రాక్టీస్‌ కోసం వెబ్సైట్‌లో మాక్‌టెస్ట్‌కు సంబంధించిన లింకు అందుబాటులో ఉందని, అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

టీఎస్‌పీఎస్సీ 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాస్తవానికి ఏప్రిల్‌లో పరీక్ష జరుగాల్సి ఉండగా.. పేపర్‌ లీకేజీ (tspsc paper leakage) వెలుగు చూడడంతో వాయిదా పడింది. ఈ క్రమంలో మళ్లీ జూన్‌ 28కి రీషెడ్యూల్‌ చేసింది.

TSPSC AMVI EXAM HALL TICKETS