నైతికత – మానవ విలువలు & పర్యావరణ విద్య అసైన్మెంట్ ఎప్రిల్ 20 లోపు సబ్మిట్ చేయాలి – ఇంటర్ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బోర్డు పరీక్షలైన నైతికత & మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్షలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు పరీక్షలను “అసైన్మెంట్ వర్క్ ప్రమ్ హోమ్” మారుస్తూ బోర్డు గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ అసైన్మెంట్ ను విద్యార్థులకు కేటాయించిన ప్రశ్నలకు ఎప్రిల్ – 1 నుండి ఎప్రిల్ – 20 తేదీ లోపల ఇంటి వద్దనే అసైన్మెంట్ రూపంలో రాసి కళాశాల ప్రిన్సిపాల్ కు నేరుగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని, లేదా పిడిఎఫ్ ఫైల్ ను ఈ మెయిల్ ద్వారా గాని పంపవలసి ఉంటుందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది.

ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 20 తారీకు లోపు విద్యార్థులు అసైన్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఏప్రిల్ 1 నుండి తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును ఇంటర్నెట్ బోర్డు కల్పిస్తుంది.

వెబ్సైట్ :: http://tsbie.cgg.gov.in

హల్ టికెట్ డౌన్లోడ్ కోసం పై లింక్ ని క్లిక్ చేయండి

అసైన్మెంట్ పరీక్షలో కచ్చితంగా విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఈ పరీక్షలు గతంలో వ్రాయలేదో వారు కూడా ఈ అసైన్మెంట్ ను తమ ప్రథమ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేసి వ్రాయవచ్చు.

అలాగే ప్రైవేటు (ఓల్డ్) విద్యార్థులు తమ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేసి వ్రాయవచ్చు.

Follow Us @