RESULT DAY : నేడే సెమీఫైనల్ ఫలితాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 03) : 2024లో జరిగే పార్లమెంట్ సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు (4 states assembly election results) నేడు, రేపు విడుదల కానున్నాయి.

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాలలో నేడు ఫలితాలు విడుదల కానుండగా, మిజోరాం రాష్ట్రంలో రేపు ఫలితాలు విడుదల కానున్నాయి.

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరం ఐదు రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్నారు. ఇక్కడ ఆధిపత్యం చూపించిన పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.