అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు – జగన్నాధ దామోదర్

  • 12 జూన్ 2022 జగన్నాధ దామోదర్ మొదటి వర్ధంతి సందర్భంగా అస్నాల శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం.

ఉద్యోగ సంఘాల నాయకత్వంలో విషయ స్పష్టతతో అందరికి అర్ధమయ్యే విధంగా ప్రసంగించే నైపుణ్యం, సమస్యల పరిష్కారం కోసం తెగువతో తాను ముందుండి, సహచరులను నడిపించే దక్షత, కాలానుగుణంగా వస్తున్న సామాజిక మార్పులను అధ్యయనం చేస్తూ ఆ వెలుగులో తన పోరాట కార్యక్రమాల్ని మార్చుకోవడం మొదలగు అంశాలు జగన్నాధ దామోదరం విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దాయి.

★ ప్రవహించే ఉత్తేజం –

తన విద్యార్థి,. నవ యవ్వన కాలంలో మరియు చివరి శ్వాస వరకు ఉద్యోగుల కోసం వారిని పోషిస్తున్న ప్రజల పక్షం వహించిన మనకాలపు మహా యోధుడు.
తొలుత తన జాతీయోద్యమ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన రాజకీయ కార్యాచరణ ప్రారంభించాడు. మాజీ మంత్రి ప్రముఖ కాంగ్రెస్ నేత తక్కలపెల్లి పురుషోత్తం రావు సహచరుడిగా కాంగ్రెస్ రాజకీయాలలో కొంతకాలం కొనసాగాడు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో పేద వర్గాలకు సీట్లు ఇవ్వాలని పోరాడి సాధించిన వారి గెలుపు కోసం పని చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన అనేక విజయాలు, భారత స్వాతంత్ర సమరంలో ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దం భారత రాజ్యాంగం. ఈ వెలుగులో లో పని చేయడం లేదని ప్రజలు మరింత పరాధీనతకు గురవుతున్నదని అని మదన పడ్డాడు.

తన విద్యార్థి,. నవ యవ్వన కాలంలో మరియు చివరి శ్వాస వరకు ఉద్యోగుల కోసం వారిని పోషిస్తున్న ప్రజల పక్షం వహించిన మనకాలపు మహా యోధుడు దామోదర్ జగన్నాథ – అస్నాల శ్రీనివాస్

జగన్నాధ దామోదర్

1968లో ఇంట్లో నక్సల్బరి వసంత మేఘ గర్జన తెలంగాణకు వ్యాపించింది. కొండపల్లి సీతారామయ్య శివసాగర్ చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి నేతల ప్రభావంతో దున్నేవాడిదే భూమి, రైతుకూలీల పోరాటాలు ఉప్పెనగా కొనసాగుతున్నాయి. ఈ పోరాటాలకు, తక్షణంగా అవి సాధిస్తున్న ఫలితాలకు ప్రేరేపించబడిన జగన్నాథ్ దామోదర్ వామపక్ష విప్లవ ఉద్యమాలతో మమేకమయ్యాడు. ఖమ్మం జిల్లాలో CPI ML PWG పార్టీ విస్తరణకు కృషి చేశాడు. విప్లవ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.
వామపక్ష విప్లవ ఉద్యమాలలో వస్తున్న చీలికలు పీలికలు ఆయనను బాధకు గురి చేశాయి. మరీ ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నర్సంపేట ప్రాంతంలో భూస్వాములను అణచివేసే సామాన్య ప్రజల గొంతుక విలువను పెంచిన యోధుడు అసెంబ్లీ టైగర్ ఓంకార్ పై పీపుల్స్ వార్ పార్టీ వరుస దాడులను ఆయనను చలింపచేశాయి. ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్న సంస్థలు విమర్శ లేదా సమాంతరంగా పని చేయాలి తప్ప దాడుల సంస్కృతి తప్పని అభిప్రాయపడ్డాడు.
1972లో ఓంకార్ పరిచయంతో ఆ వ్యక్తిత్వానికి విధేయుడుగా సహచరుడు గా మారి జీవితాంతం పూర్తి చేశాడు.

★ తెలంగాణ ఉద్యమ సితార :

1969 లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి, శివసాగర్ ల నాయకత్వంలో పీపుల్స్ వార్ అందించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్ 1969 తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్ ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్ పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి ప్రదర్శన చేసాడు. పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. తన వ్యవసాయ శాఖ ఉద్యోగాన్ని కోల్పోయారు. ఏ మాత్రం వెరవకుండా ఓంకార్ సహచరుడిగా రైతు ఉద్యమాలలో మరియు తెలంగాణ సాధనలో నిర్విరామ కృషి చేశారు.

800 గజాల స్థలాన్ని,10 లక్షల రూపాయలను సేకరించి మార్కెట్ ఉద్యోగుల భవన నిర్మాణం చిరస్మరణీయ అంశంగా నిలిచిపోతుంది. – అస్నాల శ్రీనివాస్

1975 లో వ్యవసాయ మార్కెట్ లో ఉద్యోగంలో చేరారు.ఆసియాలో అతి పెద్ద మార్కెట్ గా ఏనుమాముల మార్కెట్ రూపాంతరం చెందడం లో ఉద్యోగిగా ఉద్యోగ సంఘ నేతగా దామోదర్ అద్వితీయ కృషి చేశారు. తన సహజత కార్మిక కర్షక అనుకూల తాత్వికతను ఆచరణ పెట్టడానికి మార్కెట్ ఒక వేదికగా పని చేసింది. హమాలీలు, గుమస్తాలు, ఉద్యోగులు, సమస్త వర్గాల సమస్యలను అర్థం చేసుకొని మిలిటెంట్ స్వభావంతో పోరాడి పరిష్కరించే వాడు. మార్కెట్ కమిటీ ఉద్యోగులకు సొంత భవనాన్ని నిర్మించుకున్న తొలి ఉద్యోగ సంఘ నాయకుడు గా కార్మిక ఉద్యమాల చరిత్రలో జగన్నాథ్ దామోదర్ నిలిచిపోతారు. 800 గజాల స్థలాన్ని,10 లక్షల రూపాయలను సేకరించి మార్కెట్ ఉద్యోగుల భవన నిర్మాణం చిరస్మరణీయ అంశంగా నిలిచిపోతుంది. వ్యవసాయ మార్కెట్ ను లక్ష్మీపురం నుండి ఈ ప్రాంతానికి తరలింపు చెయ్యడంలో అమోఘమైన కృషి చేశాడు.

ఆసియాలో అతి పెద్ద మార్కెట్ గా ఏనుమాముల మార్కెట్ రూపాంతరం చెందడం లో ఉద్యోగిగా ఉద్యోగ సంఘ నేతగా దామోదర్ అద్వితీయ కృషి చేశారు. – అస్నాల శ్రీనివాస్

జగన్నాధ దామోదర కు కృతజ్ఞత స్వభావం మన వ్యక్తిత్వంలో ఉన్న అపూర్వమైన విషయం. తన రాజకీయ దృక్పధాన్ని గాడిలో పెట్టినా కమ్యూనిస్టు నాయకుడు ఓంకార్ ఉద్యోగ సంఘాల నిర్వహణలో తనకు స్ఫూర్తిగా నిలిచిన TNGO నేత నెల్లుట్ల జగన్ మోహన్ రావు ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారు. వీరిద్దరికి కుడి భుజంగా నిలిచాడు.

2003 లో పదవి విరమణ తరువాత మరింత రెట్టించిన ఉత్సాహంతో మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వరంగల్ నగరంలో వారు హాజరుకాని పాల్గొనని, సమీకరించిని సభ అంటూ లేదు. రిటైర్డ్ ఉద్యోగులను సమీకరించి వారి గొంతుకగా సభలు సమావేశాలలో వక్తగా పాల్గొనేవాడు. పరిటాల సుబ్బన్న, కారం రవీందర్రెడ్డి, రాజేష్ కుమార్, జగన్ మోహన్ రావు వంటి ఉద్యోగ సంఘాల నేతలకు నిరంతరం ప్రేరణ గా నిలిచాడు. 1969, 2001 రెండు దశల తెలంగాణ పోరాటంలో క్రియాశీల కార్యకర్తగా నేతగా పనిచేసిన దామోదర్ తెలంగాణ రాష్ట్రం సాకారం అవ్వడంతో పసిపిల్లాడిలా ఆనందపడ్డాడు. నేను సైతం నిర్మించిన త్యాగం చేసిన తెలంగాణ పోరాటం అపూర్వ విజయం అందుకోవడం లో తన వంతు చారిత్రక పాత్రను పోషించినన ఆత్మ సంతృప్తిని పొందాడు.

1969, 2001 రెండు దశల తెలంగాణ పోరాటంలో క్రియాశీల కార్యకర్తగా నేతగా పనిచేసిన దామోదర్ తెలంగాణ రాష్ట్రం సాకారం అవ్వడంతో పసిపిల్లాడిలా ఆనందపడ్డాడు. – అస్నాల శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారులకు రాజకీయ శిక్షణా పాఠశాలగా దొడ్డి కొమురయ్య పౌండేషన్ చారిత్రక పాత్రను నిర్వహించింది. 2010 నాటికి భావజాలపరంగా జగన్నాథం దామోదర్ గారు ఈ వ్యాసకర్త అస్నాల శ్రీనివాస్ కు ఆత్మీయుడు అయ్యాడు. నాన్న అనే పిలుపు తో నన్ను తన మానస తనయుడు గా భావించి అక్కున చేర్చుకుని మా ఫౌండేషన్ కార్యక్రమాలకు అండగా నిలిచారు. సమాజం కోసం పనిచేసిన త్యాగం చేసిన వీరులను కుటుంబాల తలుచుకోవడం ఫలితాలు పొందిన సమాజం పట్టించుకోకపోవడం వంటి పై బాధపడ్డాడు. దామోదర్ గారు ఇచ్చిన ప్రేరణతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వాగ్గేయకారుడిగా పనిచేసిన సుద్దాల హనుమంతు శత జయంతి సభ నిర్వహణలో మాకు తోడుగా నిలిచారు.వారి ప్రేరణతో విప్లవ సింహం నల్ల నరసింహుడు గురించి వ్యాసాలు, సభలు నిర్వహించాను. ఇప్పుడు నల్ల నరసింహులు గురించి కమ్యూనిస్టు లు, పద్మశాలీల తోపాటు అనేక సామాజిక సంఘాలు తన శత జయంతి వర్ధంతి కార్యక్రమాలను స్ఫూర్తిగా జరుపుకుంటున్నాయి. విశేష అశేష త్యాగాలు చేసి మరుగునపడి ఉన్న వీరులను ఈనాటి తరానికి తెలియజేయాలి నానా.. నువ్వు ఆ వైపుగా కృషి నిరంతరం చేయాలి అని నన్ను ప్రోత్సహించారు

2010 నాటికి భావజాలపరంగా జగన్నాథం దామోదర్ గారు ఈ వ్యాసకర్త అస్నాల శ్రీనివాస్ కు ఆత్మీయుడు అయ్యాడు. నాన్న అనే పిలుపు తో నన్ను తన మానస తనయుడు గా భావించి అక్కున చేర్చుకుని మా ఫౌండేషన్ కార్యక్రమాలకు అండగా నిలిచారు. – అస్నాల శ్రీనివాస్

2014 లో లో తెలంగాణ నవ నిర్మాణం పై దొడ్డి కొమురయ్య పౌండేషన్ ఒక రోజు సుధీర్గ సదస్సును నిర్వహించింది. ఘంటా చక్రపాణి ఎర్ర నరసింహారెడ్డి వంటి మేధావులు ఆ సభకు హాజరయ్యారు. ఘంటా చక్రపాణి గారి తెలంగాణ జైత్రయాత్ర పుస్తకాన్ని ఈ సదస్సులోనే ఆవిష్కరింపజేశారు.
చక్రపాణి మాట్లాడుతూ ఈ పుస్తకాల్ని కెసిఆర్ కూడా ఆవిష్కరింప చేస్తానని అన్నాడు. ఉద్యమాలకు ఊపిరిలూదిన, తనకు గోప్ప రాజకీయ చైతన్యం అందించిన వరంగల్ లోనే ఆవిష్కరణ చేయాలని అనుకున్నాను.
“ఈ పుస్తకాన్ని రెండు దశల తెలంగాణ ఉద్యమంలో
పాల్గొన్న జగన్నాధ దామోదర్ గారిచే ఆవిష్కరింప చేసుకోవడం నాకు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చాయి అని అన్నారు.” రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షనర్లు వారి జీవన భద్రత పటిష్టంగా ఉండాలని తపించి వారి కోసం ఒక మహా సభను నిర్వహించారు. వారి పెన్షన్, సర్వీసులలో సమస్యల పరిష్కారం కోసం ఒక సహాయక కార్యాలయాన్ని కలెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇది కూడా దామోదర్ జీవితంలో లో మరొక అపూర్వ అంశంగా నిలిచిపోతుంది.

తెలంగాణ జైత్రయాత్ర పుస్తకాన్ని రెండు దశల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జగన్నాధ దామోదర్ గారిచే ఆవిష్కరింప చేసుకోవడం నాకు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చాయి అని ఘంటా చక్రపాణి అన్నారు. – అస్నాల శ్రీనివాస్

మంత్రివర్యులు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపకులు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ పరిటాల సుబ్బారావు, దేవి ప్రసాద్, రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, జగన్ మోహన్ రావు వంటి ఉద్యోగ సంఘాల అగ్రనేతలందరు గౌరవంగా దామోదరన్న గా పిలుచుకొని వారి ప్రస్థానాన్ని కరదీపికగా మారారు.

ఉద్యమ ఉద్యోగ సంఘం నేతగా పాటు నిస్వార్థ మానవీయ సంబంధాల మనుగడ కోసం తపించేవాడు. స్థాయిలతో సంబంధం లేకుండా మనుషులందరికీ ఒక్కటే విలువ అని జీవితమంతా పాటించాడు. సమీకరణ శక్తి లేకుండా, ఆచరణ లేని జ్ఞానంతో నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులపై మారడానికి ప్రేమపూర్వక మందలింపులు చేసేవాడు. ఒకప్పుడు తాను నమ్మిన వర్గాల కోసం పోరాటం చేసే ప్రజా నేతలకు ఉద్యోగ సంఘ నాయకులకు పాలు పూర్తిగా అండగా ఉండే ధోరణి బాగా ఉండేది. ఇప్పుడు ఆ ధోరణి క్రమేపి తగ్గుతున్న సందర్భం కనిపిస్తున్నదని ఆవేదన చెందేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలతో పాటు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వారి కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలను గౌరవించడం కొనసాగించాలని హితవు పలికాడు.

జీవితాన్ని ఉద్యమంగా మలుచుకుని ఉద్యమ జీవితానికి వ్యక్తిగత జీవితానికి వ్యత్యాసం లేకుండా జీవించిన మహనీయుడు జగన్నాధ దామోదరుడు.వారికి జోహార్లు, వారి బాటలో పయనిద్దాము.

(అమరుడు జగన్నాధ దామోదర్ గారు జీవన ప్రస్థానానికి సరైన శీర్షిక. 2008,09,10 సంవత్సరాలలో మానవ హక్కుల కార్యకర్త గా,దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ స్థాపకుడిగా నా కార్యక్రమాలను పరిశీలిస్తూ వచ్చారు. తెలంగాణ కోసం జరిగిన అన్ని చర్చావేదికలో పాల్గొన్నాము.ఇంచుమించు మా ప్రసంగాలలో ఉదాసీనతను వదలాలి,సమరశీలతను పెంచాలి అనే అంశం ఉండేది. వారి పై నా కథనం చదివాక మా ఇద్దరిలో ఉన్న అనేక సారూప్య అంశాలు..ఆ క్రమంలో ఏర్పడిన అనుబంధం)

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.

Follow Us @