రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ అభినందన సభ


హనుమకొండ లో టిజిఓ ఇంటర్ విద్య కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ప్రిన్సిపాల్ గా పురస్కారం పొందిన అస్నాల శ్రీనివాస్ ను దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

సమాజానికి తిరిగి చెల్లించు వెలుగులో సామాజిక విద్య సాహిత్య పాఠశాలగా దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ను స్థాపించి జ్ఞానాన్ని, సమయాన్ని విద్యార్థుల వికాసం, సమాజ హితం కై పాటుపడుతున్న వ్యక్తి అస్నాల శ్రీనివాస్ అని డికేయఫ్ సలహాదారు డా.ఏరుకొండ నర్సింహుడు అన్నారు.


ప్రభుత్వ ఇంటర్ విద్య పరిరక్షణతో పాటు తన ఉచిత శిక్షణ
మార్గదర్శనముతో వందలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు అని అన్నారు. పత్రికా రచయితగా , కవిగా రాణిస్తూ సమకాలీన తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు అని కవి,గాయకుడు బిల్ల మహేందర్, బోనగిరి రాములు అన్నారు.

కవయిత్రి వకుళ వాసు మాట్లాడుతూ ఉద్యమాల పురిటీగడ్డ నుండి జ్ఞాన పరిమళాలు వెదజల్లే పారిజాత వృక్షంగా ఎదగడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కవులు రత్నమాల, ఉదయశ్రీ, వాసు, రమేష్, ప్రభాకర్ తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us @