BIKKI NEWS : asian games history. 19th ASIAN GAMES 2022 (2023) సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 08 వ తేదీ వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2022 వ సంవత్సరం లో జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరానికి వాయిదా పడ్డాయి…
Asian Games History
2023 ఆసియా క్రీడల కోసం చైనా ప్రభుత్వం దాదాపు 11,610 కోట్లను ఖర్చు చేస్తుంది.
మొత్తం 45 దేశాలు, 12 వేలమంది క్రీడాకారులు, 61 క్రీడాంశాలలో పోటీపడనున్నారు.
ASIAN GAMES 2023 MOSCUT
2023 ఆసియా గేమ్స్ యొక్క మస్కట్ “చెన్‌చెన్, కాంగ్‌కాంగ్, లియన్‌లియన్” గా పెట్టడం జరిగింది.
Asian Games 2023 Theme
“GREEN – SMART – ECONOMICAL – ETHICAL”
ASIA GAMES HISTORY
1948 లో లండన్ లి జరిగిన ఒలంపిక్ క్రీడలు జరిగే సమయాన, భారత ఒలంపిక్స్ కౌన్సిల్ ప్రతినిథి గురుదత్ సోంధి, ఆసియా క్రీడల (ASIAD GAMES – 2023) గురించి తన అభిప్రాయాలను ప్రకటించాడు. ఆసియా దేశాలు, ఈ విషయాన్ని అంగీకరించి, ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ తన అంగీకారాన్ని తెలిపింది. 1949 లో ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సమావేశమై ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి, 1951 లో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరపాలని నిశ్చయించాయి. ఈ క్రీడలు ప్రతి నాలుగేండ్లకొకసారి జరపాలని కూడా నిశ్చయించాయి.
1951 లో మొట్టమొదటి ఆసియన్ గేమ్స్ భారతదేశంలో జరిగాయి.. ఒలింపిక్స్ క్రీడల తర్వాత అతిపెద్ద క్రీడలుగా ఆసియన్ గేమ్స్ పేరుగాంచాయి.. 1982 లో రెండో సారి ఆసియన్ గేమ్స్ భారత్ లో జరిగాయి.
INDIA HOSTED ASIAN GAMES
2023 ఆసియా గేమ్స్ లో భారత్ 655 మంది క్రీడాకారులతో బరిలోకి దిగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి 16 మంది, తెలంగాణ నుండి 14 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటున్నారు.
మొదటిరోజు ఆరంభ వేడుకలలో హార్మన్ ప్రీత్ సింగ్, లవ్లీనా భారత్ తరపున పతాకదారులుగా ఉండనున్నారు.
ఒలంపిక్స్ పథకాలు గెలిచిన ఐదుగురు భారత క్రీడాకారులు ఆసియా గేమ్స్ 2023లో పాల్గొంటున్నారు వారు పీవీ సింధు బజరంగ్ పూనియా, లవ్లీనా బోర్గోహెయిన్, నీరజ్ చోప్రా, మీరాబాయి ఛాను.
ASIAN GAMES 2018
1982 న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో మొదటిసారి మొదటి స్థానం పొందిన చైనా.. 2018 జకార్తా లో జరిగిన ఆసియా క్రీడల్లో వరకు తమ టాప్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది 2023 లో జరిగే ఈ క్రీడల్లో కూడా చైనా మొదటి స్థానం దక్కడం ఖాయమే.
2018 జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ మొట్టమొదటిసారి అత్యధిక పథకాలతో 8వ స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో మొత్తం 70 పథకాలు సాధించింది మ. వీటిలో 16 స్వర్ణ పథకాలు 23 రజిత పథకాలు 31 కాంస్య పథకాలు కలవు.
INTRODUCING GAMES IN ASIAN GAMES 2023
ఆసియా గేమ్స్ 2023లో తొలిసారిగా ప్రవేశ పెడుతున్న క్రీడలు ‘ఈ – స్పోర్ట్స్’ మరియు ‘బ్రేకింగ్ డాన్స్’. అలాగే టి20 క్రికెట్ ను కూడా ఈ సంవత్సరం నుండి ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టారు 2018లో లేకుండా మళ్ళీ ఈ సంవత్సరం చెస్, గో జియాంగ్ క్వీ క్రీడలను పునఃప్రవేశపెట్టారు.
ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. ఇంతకు ముందు1990లో బీజింగ్, 2010లో గాంగ్జౌ నగరాలు ఆతిధ్యం ఇచ్చాయి.
ASIAN GAMES 2026
2026 ఆసియన్ గేమ్స్ ని జపాన్ లోని ఐచి, నగోయ (AICHI, NAGOYA) నగరాలలో నిర్వహించనున్నారు ONE ASIA MOTTO తో ఈ గేమ్స్ నిర్వహించనున్నారు. ఇంతకుముందు జపాన్ దేశం 1958లో టోక్యో వేదికగా, 1994లో ఈరోజు హిరోషిమా వేదికగా ఆసియా క్రీడలు నిర్వహించింది.