ASIAN GAMES 2023 : భారత క్రికెట్ జట్టు ఎంపిక

హైదరాబాద్ (సెప్టెంబర్ 19) : 19వ ASIAN GAMES 2023 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు చైనా లోని హంగ్జౌ నగరంలో నిర్వహించనున్నారు. 2022 లో నిర్వహించాల్సిన ఈ గేమ్స్ ను 2023 లో నిర్వహిస్తున్నారు.

ఆసియా గేమ్స్ లో టీ20 ఫార్మాట్ లో క్రికెట్ ను ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి బిసిసిఐ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో పురుషుల జట్టును, స్మృతి మంధాన నేతృత్వంలో మహిళల జట్టును ఎంపిక చేసింది.

భారత పురుషుల జట్టు అక్టోబర్ 3న తన తొలి మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ ఆడనుంది.

★ పురుషుల క్రికెట్ జట్టు

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, జితేశ్ శర్మ, ప్రభమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్