హైదరాబాద్ (జూన్ – 15) : ఆసియా కప్ 2023 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ఆసియా కప్ 16వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల (ASIA CUP 2023 SCHEDULE) చేశారు. పాకిస్థాన్ మరియు శ్రీలంక ఆసియా కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి.
పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన మ్యాచ్ లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
మొత్తం 13 వన్డే మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పాల్గొంటాయి.
ఈ టోర్నమెంట్‌లో ఈ ఏడాది మూడు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి, మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి.
సూపర్ ఫోర్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 17న ఫైనల్ ఆడతాయి.
భారత్, పాకిస్థాన్, నేపాల్‌లు ఒక గ్రూపులో ఉండగా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మరో గ్రూపులో ఉన్నాయి.
గత ఏడాది UAEలో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.
మహిళల ఆసియా కప్ క్రికెట్ విజేతల లిస్ట్ https://bikkinews.com/womens-asia-cup-t20-cricket-winners-list-in-telugu/16/10/