హైదరాబాద్ (ఎప్రిల్ – 25) : తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వరంగల్ లోని అశోక్ నగర్ సైనిక్ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను సంస్థ విడుదల చేసింది.
ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఒంటిగంట వరకు ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం రెండు గంటల నుండి 5:00 గంటల వరకు ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.