లార్డ్స్ (జూన్ – 28) : లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ వేగంగా ఆడడంతో భారీ స్కోరు దిశగా సాగుతోంది.
డేవిడ్ వార్నర్ (66), లబూషెన్ (47), స్మిత్ (85*) , హెడ్ (77) సమయోచితంగా ఆడడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆరంగేట్ర బౌలర్ జోస్ంగ్ ఓపెనర్లు ఇద్దరిని ఇంటి దారి పట్టించాడు. అలాగే పార్ట్ టైమ్ బౌలర్ జో రూట్ 100 కు పైగా భాగస్వామ్యం నెలకల్పి ఆస్ట్రేలియాను భారీ స్కోరు దిశగా తీసుకువెలుతున్న హెడ్ ను ఔట్ చేయడంతో పాటు అదే ఓవర్ లో గ్రీన్ ను కూడా ఔట్ చేసి ఇంగ్లండ్ ని ఆటలో నిలిపాడు.
ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ (174 ఇన్నింగ్స్ లలో) అంతర్జాతీయ టెస్టులలో అత్యంత వేగంగా 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కుమర సంగక్కర (172 ఇన్నింగ్స్ లలో) మొదటి స్థానంలో ఉన్నారు
అలాగే వరుసగా 100 వ టెస్ట్ ఆడుతున్న ఆటగాళ్ల జాబితాలోకి స్పిన్నర్ లియోన్ చేరాడు.