మాంచెస్టర్ (జూలై – 21) : ASHES 2023 లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పట్టు బిగిస్తుంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 592 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బెయిర్‌స్ఠో (99*) సెంచరీ మిస్ అయింది. 5 టెస్ట్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 తో ముందంజలో ఉంది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 113 పరుగులతో ఆడుతూ ఇంకా 162 పరుగుల వెనుకబడి ఉంది. లబూషెన్, మిచెల్ మార్షల్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ – 3, వోక్స్ – 1 వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రూట్ (84), బ్రూక్ (61), స్టోక్స్ (51), బెయిర్‌స్ఠో (99*) రాణించడంతో 592 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో క్రాలీ (189) భారీ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో హెజిల్‌ఉడ్ – 5, స్టార్క్ – 2, గ్రీన్ – 2 వికెట్లు తీశారు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా స్టువర్ట్ బ్రాడ్ నిలిచారు. మురళీధరన్ (800), షేన్ వార్న్ (788), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) బ్రాడ్ కంటే ముందు ఉన్నారు.