లీడ్స్ (జూలై – 06) : the ashes 2023 3rd test మొదటి రోజు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లీషు బౌలర్లు సమర్దవంతంగా బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా 263 పరుగులకె ఆలౌట్ అయింది. ఒక్క మిచెల్ మార్ష్ మాత్రమే రాణించి సెంచరీ (118) సాదించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ – 5, క్రిస్ వోక్స్ – 3, బ్రాడ్ – 2 వికెట్లు తీశారు. జట్టులో మార్పులు ఇంగ్లండ్ జట్టు కు మేలు చేశాయి.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 68/ 3 స్కోర్ తో ఉంది. కమ్మిన్స్ 2, మిచెల్ మార్ష్ 1 వికెట్ తీశారు. క్రిజులో బెయిర్‌స్ఠో, జో రూట్ ఉన్నారు.